Read more!

English | Telugu

హాలీవుడ్ లో ప్రియాంక మరో సెన్సేషన్

మన హీరోయిన్లు ఒక్కొక్కరుగా హాలీవుడ్ లో స్థానం సుస్థిరం చేసుకుంటున్నారు. దీపికా ' xXx రిటర్న్ ఆఫ్ ది గ్జాండర్స్ కేజ్ ' లో విన్ డీజిల్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సూపర్ స్టార్ డ్వేన్ జాన్సన్ ( రాక్ ) తో కలిసి ' బేవాచ్ ' అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించింది. రాక్ తన ట్విట్టర్లో, ప్రియాంక చోప్రాను బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ది వరల్డ్ అని పొగుడుతూ, వెల్ కం టు బేవాచ్ ఫ్యామిలీ అని ట్వీట్ చేశాడు. ఇప్పటికే ప్రియాంక ' క్వాంటికో ' అనే హాలీవుడ్ టీవీ సీరీస్ లో యాక్ట్ చేసింది. బేవాచ్ మూవీ కూడా అదే పేరుతో ఉన్న టీవీ సీరీస్ స్టోరీతో తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ప్రియాంకది విలన్ పాత్ర కావడం కొసమెరుపు.