Read more!

English | Telugu

బ్రహ్మోత్సవం.. నాలుగ్గంట‌లా?

కొంత‌మంది ద‌ర్శకులు ఎంత చెప్పినా ప‌ద్దతి మార్చుకోరు. కాగితంపై రాసింద‌ల్లా తీస్తూ కూర్చుంటారు. చివ‌రికి వ‌చ్చేస‌రికి నిడివి పెరిగిపోతుంది. లైంగ్త్ పెరిగి.. సినిమా బోర్ కొట్టేస్తుంది. ఆ త‌ర‌వాత‌ ట్రిమ్ చేసుకోలేక‌.. నానా పాట్లూ ప‌డాలి. శ్రీ‌కాంత్ అడ్డాల తీరు కూడా ఇలానే ఉంటుంది. కొత్త బంగారులోకం సినిమా తీయ‌మంటే... మూడున్నర గంట‌ల ఫుటేజ్ ఇచ్చాడు. దాన్ని దిల్‌రాజు ద‌గ్గరుండి క‌త్తెర్లు వేసుకున్నాడు. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టుకీ ఇదే రిపీట్ అయ్యింది. దిల్‌రాజుకి శ్రీ‌కాంత్ శైలి తెలుసుకాబ‌ట్టి స‌ర్దుకుపోయాడు. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాకీ శ్రీ‌కాంత్ ఇదే సీన్ రిపీట్ చేస్తున్నాడ‌ట‌. తీసిందే తీసి.. సీన్‌ని ల్యాగ్ చేసి చిత్రబృందాన్ని తిక‌మ‌క పెడుతున్నాడ‌ట‌.

ఈ విష‌యంలో మ‌హేష్ బాబు కూడా శ్రీ‌కాంత్‌పై ఒక‌టికి రెండు సార్లు ఫైర్ అయ్యాడ‌ని టాక్‌. ఓ సంద‌ర్భంలో షూటింగ్ ఆపేసి వెళ్లిపోయాడ‌ట‌. 'సీన్లు స‌రిగా రాసుకుని రా.. అప్పుడు షూటింగ్ చేద్దాం' అన్నాడ‌ట‌. ఎప్పుడూ కూల్‌గా ఉండే మ‌హేష్ ఇలా స్పందించేస‌రికి.. యూనిట్ అంతా షాకైపోయింద‌ని టాక్‌. అయినా.. శ్రీ‌కాంత్‌లో మార్పు రాలేద‌ని.. సినిమాని ఎప్పటిక‌ప్పుడు చెక్కుతూనే ఉన్నాడ‌ని, అందుకే ఏప్రిల్‌లో రావాల్సిన ఈ సినిమా మే 31కి వాయిదా ప‌డిపోయింద‌ని టాక్‌. సినిమా లెంగ్త్ విష‌యంలో మ‌హేష్ చాలా నిక్కచ్చిగా ఉంటాడు. అందుకే.... 'మూడు గంట‌ల సినిమా తీయొద్దు.. ఎంత కావాలంటే అంతే తీసుకో..' అని వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. దాంతో శ్రీ‌కాంత్ మెల్లిమెల్లిగా దార్లోకొస్తున్నాడ‌ట‌. అయినా స‌రే.. ఫుటేజ్ మాత్రం పెరిగిపోతోంద‌ని తీరా నాలుగు గంట‌ల సినిమాగా త‌యారైనా ఆశ్చర్యంలేద‌ని ఇండస్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి