English | Telugu

కోట శ్రీనివాసరావు మృతిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోది!

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చి పరలోకాలకు తరలిపోయిన నటుడు కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తమ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. అలాగే భారత ప్రధాని నరేంద్రమోది తన సంతాప సందేశాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంపారు.

‘‘కోట శ్రీనివాసరావుగారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి’’ అంటూ మోదీ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. 1999 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు కోట శ్రీనివాసరావు. 1999 నుంచి 2004 వరకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలందించారు.