English | Telugu
ప్రేమమ్ హీరోయిన్ ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్..!
Updated : Apr 20, 2016
మణిరత్నం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దొరకడమంటే మాటలు కాదు. తన సినిమాల్లో సీనరీలను, హీరోయిన్స్ ను అందంగా చూపించడంలో దేశంలోనే బెస్ట్ డైరెక్టర్ గా మణి రత్నం కు పేరుంది. ఆ అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది సాయి పల్లవి. విషయంలోకి వెళ్తే కార్తీ హీరోగా, మణిరత్నం ఒక లవ్ స్టోరీని ప్లాన్ చేశాడు. మళయాళ ప్రేమమ్ సినిమాతో, మలార్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సాయి పల్లవిని ఈ సినిమాలో తీసుకోవాలని మొదట మణి అనుకున్నా, ఆమె వయసు సరిపోదని అనిపించిందట. ఆమె స్థానంలో బాలీవుడ్ లో హాట్ భామ అదితీ రావు హైదరీని తీసుకున్నాడు. తను అనుకున్న పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేయగలదని మణికి అనిపించిందట. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో మూవీ యూనిట్ బిజీగా ఉన్నారని సమాచారం.