English | Telugu
అక్షయ్ మనసున్నోడు.. లాతూర్‌కి 50 లక్షల విరాళం
Updated : Apr 20, 2016
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ తాను మనుసున్నవాడినని మరోసారి రుజువు చేశారు. తీవ్రమైన కరువుతో అల్లాడుతున్న తన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి స్వయంగా ముందుకు వచ్చారు. మరాఠ్వాడాతో విదర్భ తదితర ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా తాగేందుకు నీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. వారి కోసం కేంద్రప్రభుత్వం వాటర్ రైళ్లని నడిపి దాహాన్ని తీరుస్తుంది. ప్రజల అవస్థలను చూసిన అక్షయ్ వారికి తన వంతుగా ఏమైనా చేయాలనుకున్నాడు. కరువును పారద్రోలే ఉద్దేశ్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం జలయుక్త్ శివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం గురించి తెలుసుకున్న అక్షయ్ కుమార్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి 50 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. కరువును రూపుమాపడంలో తాను కూడా సహకరిస్తానని సీఎంకు హామీ ఇచ్చారు. అక్షయ్ ఔదార్యానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ధన్యవాదాలు తెలిపారు.