English | Telugu
మెగాస్టార్ సినిమా ఐతే మాత్రం నాకేంటి..?
Updated : Apr 20, 2016
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ పక్కన హీరోయిన్ గా నటించడానికి, అక్కడి హీరోయిన్లందరూ పోటీ పడుతుంటారు. హిందీ మాస్ జనాల్లో సల్మాన్ కున్న ఫాలోయింగ్ అలాంటిది. అందుకే ఈ మెగాస్టార్ సినిమాలో నటించాలని కోరుకుంటుంటారు. ఆ అవకాశం వస్తే అసలు వదిలిపెట్టరు. సల్లూభాయ్ క్రేజ్ తమకు ఫుల్లుగా హెల్ప్ అవుతుందని హీరోయిన్లకు తెలుసు. కానీ దీపికా పదుకుణే మాత్రం, సల్మాన్ సినిమా అయినా తన పాత్రకు వెయిట్ లేకపోతే చేయనని తెగేసి చెబుతోందట. సల్మాన్ తో ఇప్పటికే ప్రేమ్ రతన్ థన్ పాయో, సుల్తాన్ సినిమాలు మిస్సైన దీపికకు మరోసారి సల్మాన్ తో నటించే అవకాశం వచ్చింది. కబీర్ ఖాన్ తెరకెక్కించే ఈ సినిమాలో, సల్మాన్ సరసన దీపికను తీసుకుందామని అనుకుంటున్నాడు. కానీ పాత్ర చాలా కొత్తగా ఉంటూ, తన క్యారెక్టర్ కు వెయిట్ ఉండాలంటూ దీపిక కండిషన్స్ పెడుతోందట. హాలీవుడ్ కు వెళ్లిన తర్వాత అమ్మడుకు గోరోజనం ఎక్కువైందంటూ గుసగుసలాడుతున్నారట బాలీవుడ్ జనాలు.