English | Telugu
పవన్ ఎప్పటికీ ట్రెండ్ సెట్టరే గురూ..!
Updated : Apr 5, 2016
నేను ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తానంటూ గబ్బర్ సింగ్ లో చెప్పినట్టే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు తెరపై హీరో లుక్ మార్చి హీరో మేనరిజానికి సరికొత్త భాష్యం చెప్పారు. మిడిల్ క్రాఫైనా..హార్లే డేవిడ్సన్ బైక్ అయినా, బాలులో ఫ్యాంట్ పై ఫ్యాంట్ వేసినా పవన్ కే చెల్లింది. సినిమా సినిమాకో వేరియేషన్ చూపిస్తూ ట్రెండ్ విషయంలో నూతనత్వాన్ని చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ లో పోలీస్ డ్రెస్ అంటే ఇస్త్రీ నలగకుండా టక్ చేసి హుందాగా ఉండాలనే పాత కాలపు కట్టుబాట్లని మార్చి పోలీస్ బెల్ట్ నడుముకి కట్టి తలకి రెడ్ కలర్ కండువాని కడితే తెలుగు నాట ప్రభంజనమైంది. దీనిని అనుకరిస్తూ ఎంతో మంది హీరోలు సందడి చేశారు.
ఇపుడు గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా లుక్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పవన్. దానికి తగ్గట్టే కొత్తగా రిలీజైన ఫోటోస్ లో ఫ్యాంట్ కి బదులు గళ్ల లుంగీ కట్టి దానిపై పోలీస్ షర్ట్ వేసి దానికి బెల్ట్ పెట్టారు పవన్. అక్కడితో ఆగకుండా సగం షేవింగ్ చేసుకుని భుజాన గన్ తో మెడలో కండువాతో మ్యాన్లీ లుక్ నడిచి వస్తున్న లేటేస్ట్ పిక్చర్స్ అభిమానుల్ని పిచ్చెక్కిస్తున్నాయి. దీన్ని చూస్తుంటే మరో సరికొత్త ట్రెండ్ కి పవన్ శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తుంది. ఈ గెటప్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. మరి రానున్న రోజుల్లో ఈ గెటప్ ఎంత సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో.