English | Telugu

ఎట్టకేలకు ఓటీటీలోకి 'ప్రతినిధి 2'.. 'దేవర' ఎఫెక్ట్ ఉంటుందా..?

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్.. ఈ ఏడాది 'ప్రతినిధి 2'తో ప్రేక్షకులను పలకరించాడు. మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్.. మే 10న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. (Prathinidhi 2)

'ప్రతినిధి 2' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆహా ప్రకటించింది. ఇటీవల మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తుండగా.. 'ప్రతినిధి 2' మాత్రం ఏకంగా నాలుగు నెలలకు ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెడుతుండగా.. అదేరోజు నారా హీరో మూవీ ఓటీటీలోకి వస్తోంది. (Devara)

వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్స్ పై కుమార్ రాజా, ఆంజనేయులు, సురేంద్రనాథ్ నిర్మించిన 'ప్రతినిధి 2'లో నారా రోహిత్, సిరి లెల్లా, సచిన్ ఖేడేకర్, ఉదయ భాను, దినేష్ తేజ్, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.