English | Telugu

తిరుపతి లడ్డు తయారిలో రోజా కి 15 % వాటా అంట! మిగతా వారికి ఎంతో తెలుసా!

నవ్వుల కామెడీ షో జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యి ఆ తర్వాత సినిమాల్లో కూడా తనదైన కామెడీ తో అశేష అభిమానులని సంపాదించుకున్నాడు కిరాక్ ఆర్ఫీ(kiraak rp)గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పలు సమస్యలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వచ్చే ఆర్ఫీ తిరుపతి లడ్డు విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.

తిరుపతి లడ్డులో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఇప్పుడు షాక్ లో ఉన్నారు. ఈ విషయంపై ఒక డిబేట్ లో పాల్గొన్న ఆర్ఫీ పలు సంచలన విషయాలని వెల్లడి చేసాడు.నూటికి నూరు శాతం తిరుపతి లడ్డు లో జంతువుల కొవ్వు తో తయారు చేసిన నూనె ని వాడి కోట్ల రూపాయల స్వామి వారి డబ్బుని దోచేశారు. అలా దోచేసిన డబ్బుల్లో ప్రముఖ హీరోయిన్,గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన రోజా(roja)కి పదిహేను శాతం వాటా వెళ్ళింది.

ఇది పూర్తిగా నిజమని, కావాలంటే రోజా డిబేట్ కి రావాలని ఆర్ పి సవాలు విసురుతున్నాడు. అదే విధంగా కొంత మంది ప్రభుత్వ పెద్దలతో కలిసి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్ర చందనాన్ని అక్రంగా రవాణా చేసి కూడా కోట్ల రూపాయలని సంపాధించిందని కూడా ఆర్పీ చెప్పుకొచ్చాడు.మరి రోజా ఈ ఆరోపణల మీద ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.