English | Telugu

ఒంటరిగా పని చేసే బామ్మకు తోడుగా ఇండియా మైకేల్ జాక్సన్


మూవీ ఇండస్ట్రీలో అందరూ ఒకేలా ఉండరు. కొందరు డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఇంకొంతమంది ఓ రేంజ్ లో లెవెల్ కొడుతూ ఉంటారు. కొందరు ఆటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. ఐతే ప్రభుదేవా మాత్రం ఎప్పుడూ నేల మీదే నడుస్తాడు. ఒకప్పుడు ప్రభుదేవా అంటే చాలు ప్రతీ ఒక్కరి బాడి ఊగిపోయేది. ప్రేమికుడు మూవీలో డాన్స్ చూస్తే చాలు డాన్స్ రాని వాళ్ళు కూడా లేచి నిలబడి మరీ డాన్స్ చేసేవాళ్లు. ఆ తర్వాత ప్రభుదేవా శకం కాస్త వెనకబడింది. కొత్త కొత్త కొరియోగ్రాఫర్లు వచ్చి వాళ్ళ వాళ్ళ డాన్స్ స్టైల్స్ తో ఇండస్ట్రీని ఏలడం మొదలుపెట్టారు.

ఇక ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రభుదేవా మళ్ళీ లైంలైట్ లోకి వచ్చారు. మూవీస్ లో నటిస్తూ, ఈవెంట్స్ చేస్తూ అప్పుడప్పుడు ఢీ లాంటి డాన్స్ షోస్ లో కనిపిస్తూ తన హవా కొనసాగిస్తున్నారు. ప్రభుదేవా కూడా టూర్స్ కి వేరే వేరే ప్లేసెస్ కి వెళ్లి అక్కడి ఫొటోస్ ని వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక ఇన్స్పిరేషనల్ పిక్ ని రీసెంట్ గా పోస్ట్ చేసాడు. "కొండ మీద ఈమె ఒక్కర్తే కట్టెలు పోగేసి మోపు కట్టుకుంటోంది" అని పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే ప్రభుదేవా మీద అభిమానాన్ని మాములుగా చెప్పలేదు. "ఆమె ఒక్కర్తే ఏంటి నువ్వు తోడున్నావుగా, చిన్నప్పటి నుంచి మీ ఫాన్స్ మీ..చికుబుకు చికుబుకు రైలే అంటే మాకు ఇష్టం..మీరు చాలా సింపుల్ గా ఎక్స్ట్రార్డినరీగా డాన్స్ చేస్తారు. ఆల్వెస్ నంబర్ వన్ డాన్స్ మాస్టర్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.