English | Telugu

కంద కి లేని దురద కత్తిపీటకెందుకు బాబు

మిగతా డైరెక్టర్స్ సంగతేమో కానీ హరీష్ శంకర్(harish shankar)సినిమాల వెనుక ఉన్న రహస్యం మాత్రం మెజారిటీ సినీ అభిమానులకి తెలుసు. అయన మైండ్ సెట్టే హీరోల బాడీ లాంగ్వేజ్. ఇది నిజమా అని కొంత మంది అనుకోవచ్చు. అలాంటి వాళ్ళందరు లేటెస్ట్ గా హరీష్ ఇస్తున్న రీ ట్రోల్స్ ని చూసి క్లియర్ గా అర్ధం చేసుకోవచ్చు.

హరీష్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్(mr bachchan)జోష్ లో ఉన్నాడు. ట్రైలర్ రాకతో సినిమా హిట్ అనే సంకేతాలు సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి.రిలీజ్ డేట్ అగస్ట్ 15 కి ముహూర్తం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. అంతే రేంజ్ లో పలు విషయాల మీద ట్రోల్ల్స్ వస్తున్నాయి.వయసులో పెద్ద వాడైన రవితేజ సరసన ఎంతో చిన్న అమ్మాయి అయిన భాగ్యశ్రీ బోర్సే(bhagyashri borse) ని హీరోయిన్ గా ఎంచుకోవడం ఎంత వరకు కరెక్ట్. గతంలో కూడా ధమాకా లో శ్రీ లీల(sreeleela)ని ఇలాగే ఫిక్స్ చేసారని ట్రోల్ల్స్ చేస్తున్నారు. దీంతో హరీష్ తనకి మాత్రమే సాధ్యమయ్యే ఆటిట్యూడ్ తో ఒక రేంజ్ లో రీ ట్రోల్ ఇస్తున్నాడు.

సినిమాకి సంబంధించి హీరోకి ఉండాల్సింది స్క్రీన్ ఏజ్. అంతే కానీ ఒరిజినల్ ఏజ్ తో సంబంధం లేదు.అయినా ఒరిజినల్ ఏజ్ ఎంత ఉంటే అంత ఏజ్ ఉన్న క్యారెక్టర్స్ చెయ్యరు కదా.అందుకే స్క్రీన్ ఏజ్ కి తగ్గట్టుగా హీరోయిన్లని సెలెక్ట్ చేసుకుంటాం. అయినా ఆ హీరోయిన్లకి లేని బాధ మీకెందుకు అంటూ తనదైన స్థాయిల్లో రీ ట్రోల్ చేస్తున్నాడు. పైగా బచ్చన్ ట్రైలర్ చివరలో కూడా రవితేజ తో ఈ విషయం చెప్పించాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.