English | Telugu
ఆ అమ్మాయి పెళ్లికి హాజరైన ప్రభాస్
Updated : Mar 13, 2016
ప్రభాస్ ను అందరూ డార్లింగ్ అని పిలుస్తారు. అందుకు కారణం లేకపోలేదు. స్క్రీన్ మీదే రెబల్ స్టార్ తప్ప, బయట చాలా స్వీట్ పర్సన్ గా ప్రభాస్ కు పేరు. చాలా సాఫ్ట్ గా ఉంటాడు. తాజాగా తనకు డార్లింగ్ అన్న పేరు ఎంత యాప్ట్ అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు బాహుబలి. తన ఇంట్లో పనిచేసే అమ్మాయి పెళ్లి చందానగర్ లో జరిగింది. పెళ్లి సంగతి ప్రభాస్ కు వాళ్లు చెప్పారు కానీ, షూటింగ్ లో యమబిజీగా ఉన్న తను వస్తాడని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. సరిగ్గా పెళ్లి టైమ్ కి అక్కడ హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచాడు యంగ్ రెబల్ స్టార్. మెరుపుతీగలా వచ్చి మాయమైపోకుండా, కాసేపు అక్కడే ఉండి పెళ్లి చూడటమే కాక, అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఫ్యాన్స్ కు సెల్ఫీలు తీసుకోవడానికి నో చెప్పకుండా ఓపిగ్గా వాళ్లతో ఫోటోలు దిగాడు. స్టేటస్ చూపించకుండా, ఆ అమ్మాయి పెళ్లికి హాజరై తన డార్లింగ్ పేరును సార్థకం చేసుకున్నాడు ప్రభాసుడు.