English | Telugu
సర్దార్ మేకింగ్ వీడియో రిలీజ్..ఫ్యాన్స్ రెస్పాన్స్
Updated : Mar 12, 2016
టాలీవుడ్ లో ఇప్పుడు అత్యంత క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కు సంబంధించి చిన్న స్టిల్ వచ్చినా, పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అందుకే అభిమానులకు చిన్న సర్ ప్రైజ్ గా ఈరోజు సర్దార్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది మూవీ టీం. ప్రస్తుతం యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియో, శరవేగంగా లైక్ లు షేర్ లు పెంచుకుంటోంది. ఇప్పటికే ఏప్రిల్ 8 న విడుదల కన్ఫామ్ అని తెలిసి పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్ ఆనందాన్ని, ఈ మేకింగ్ వీడియో మరింత పెంచేలా ఉంది.
41 సెకన్స్ డ్యూరేషన్ తో, మెస్మరైజింగ్ గా మేకింగ్ వీడియోను కట్ చేశారు. ఇది చూసిన తర్వాత మూవీపై అంచనాలు మరింత పెరిగిపోతాయనడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా పవన్ కర్రను తిప్పుతున్నట్టుగా ఉన్న బిట్, కౌబాయ్ టోపీని గన్ తో సరి చేసుకుంటున్న మరో షాట్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి. కామెంట్స్ లో, లైక్స్ లో పవన్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్.