English | Telugu
అల్లు అర్జున్ సినిమా రైటర్ తో ఎన్టీఆర్ మూవీ
Updated : Mar 13, 2016
త్రివిక్రమ్, కొరటాల శివ, సుకుమార్..వీళ్లందరి స్ట్రాంగ్ పాయింట్ ఏంటో తెలుసా..రైటింగ్ స్కిల్స్. రైటర్ గా స్టార్ స్టేటస్ కు వెళ్లిన వాళ్లందరూ, డైరెక్టర్స్ గా కూడా అద్భుతంగా రాణిస్తారనడానికి వీళ్లే ఎగ్జాంపుల్. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి మరో పేరు చేరింది. కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించిన వక్కంతం వంశీ డైరెక్టర్ గా మారబోతున్నాడు. వాటిలో అల్లు అర్జున్ రేసుగుర్రం అయితే, కలెక్షన్లలో టాప్ 5లోకి చేరింది. తనకు కూడా టెంపర్ లాంటి కథను ఇచ్చిన వక్కంతంతో సినిమా చేద్దామని ఎన్టీఆర్ కు ఎప్పటినుంచో ఆలోచన ఉంది. అందుకే వక్కంతం చెప్పిన తాజా కథ నచ్చి, అతని డైరెక్షన్లో సినిమాకు సై అన్నాడని సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో జనతా గ్యారేజ్ లో యాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్, అది పూర్తవ్వగానే వక్కంతంతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.