English | Telugu

ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. స్పిరిట్ ని కాదని మరో సినిమా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 2026 సంక్రాంతికి 'ది రాజా సాబ్'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న 'ఫౌజి' కూడా శరవేంగా షూటింగ్ జరుపుకుంటోంది. వీటి తర్వాత ప్రభాస్ చేతిలో స్పిరిట్, కల్కి-2, సలార్-2 తో పాటు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఉన్నాయి. అయితే వీటిలో ఏది మొదట సెట్స్ పైకి వెళ్తుందో, ఏది మొదట రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ వచ్చింది.

'హనుమాన్'తో దర్శకుడిగా పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. ఆ తర్వాత పలు సినిమాలను ప్రకటించాడు కానీ, ఇంతవరకు ఏదీ సెట్స్ పైకి వెళ్ళలేదు. రణవీర్ సింగ్ తో తలపెట్టిన 'బ్రహ్మరాక్షస' క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆగిపోయింది. 'హనుమాన్'కి సీక్వెల్ గా రిషబ్ శెట్టితో 'జై హనుమాన్'ని ప్రకటించాడు.. ఇది ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది.. ఇప్పుడు దాని ఊసే లేదు. ఇలాంటి సమయంలో.. వరుస భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ తో సినిమా కమిటై అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రశాంత్ వర్మ. పైగా, ఇది రణవీర్ సింగ్ తో చేయాలనుకున్న 'బ్రహ్మరాక్షస' సినిమానే అనే ప్రచారం కూడా ఉంది. దీంతో, ఇప్పట్లో ఈ సినిమా ఉండకపోవచ్చని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా జెట్ స్పీడ్ లో వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్ర‌శాంత్ వ‌ర్మ ఏంటి.. కొత్త సినిమా మొదలు పెట్టకుండా ఇంతకాలం సైలెంట్ గా ఉంటున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ, ప్రశాంత్ మాత్రం ఈ గ్యాప్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ విజువ‌లైజేష‌న్ వ‌ర్క్ పూర్తి చేశాడట. ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌, ప్ర‌తీ సీన్‌ ప్రీ విజువ‌లైజేష‌న్ లో డిజైన్ చేశాడట. దీని వల్ల షూటింగ్ క్లారిటీగా, చాలా వేగంగా పూర్తి చేయొచ్చు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశముంది అంటున్నారు.

నిజానికి ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాడనే అభిప్రాయం అందరిలో ఉంది. కానీ, ఇప్పుడు 'బ్రహ్మరాక్షస' షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కానుందనే వార్త ఆసక్తికరంగా మారింది. అప్పుడు 'ది రాజా సాబ్' తర్వాత 'స్పిరిట్' మొదలవుతుంది అనుకుంటే.. అనూహ్యంగా 'ఫౌజి' వచ్చింది. ఇప్పుడేమో 'బ్రహ్మరాక్షస' తెరపైకి వచ్చింది. మరి ప్రభాస్ 'స్పిరిట్' కంటే ముందు దీనిని స్టార్ట్ చేస్తాడా? లేక 'రాజా సాబ్', 'ఫౌజి' సినిమాలు చేస్తున్నట్టుగా.. ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా పారలల్ గా చేస్తాడేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.