English | Telugu
ఊహించనివిధంగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ k' ఫస్ట్ లుక్!
Updated : Jul 19, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ప్రాజెక్ట్ k' నుంచి ఆయన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ హాలీవుడ్ సూపర్ హీరోల తరహాలో శక్తిమంతంగా కనిపిస్తున్నాడు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ k'. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, దీపికా పదుకొణె ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 21 ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీపిక ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్, ఈరోజు(జూలై 19) ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సూపర్ హీరో తరహా దుస్తులు, పొడవాటి జుట్టు, గడ్డంతో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ ని బట్టి ఇదొక భారీ యుద్ధ సన్నివేశంలోని స్టిల్ అని అర్థమవుతోంది.
అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ పై కొందరు నెటిజన్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. మార్ఫ్ డ్ ఫొటోలా లేదా ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఉందని అభిప్రాయపడుతున్నారు. మెజారిటీ నెటిజన్లు మాత్రం హాలీవుడ్ తరహాలో ఉందని ప్రశంసిస్తున్నారు.
'ప్రాజెక్ట్ k'లో k అంటే 'కాలచక్ర' అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై జూలై 21 న స్పష్టత రానుంది.