English | Telugu
మహేష్ బాబు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ... సీక్రెట్ రివీల్
Updated : Jul 19, 2023
సూపర్‌స్టార్ మహేష్ బాబు మూవీ వచ్చి ఎన్నాళ్లయింది. త్వరలో వచ్చేస్తే బావుంటుంది. రావాలంటే కాస్త స్పీడ్ పెంచాలి గురూ అంటున్నారు ఫ్యాన్స్. తనను అంతగా మిస్ అవుతున్న ఫ్యాన్స్‌ని ఇంకా వెయిట్ చేయిస్తే ఏం బావుంటుంది? అని అనుకుంటున్నారు మహేష్. అందుకే అభిమానగణం కోసం స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. మహేష్బాబుకి ఇప్పుడు 47 ఏళజ్లు. అయితే ఏమాత్రం అలా కనిపించరు. ఎప్పటికప్పుడు ఫిట్‌గా, హ్యాండ్‌సమ్‌గా ఉంటారు. టాలీవుడ్‌లో ఉన్న ఫిట్టెస్ట్ యాక్టర్స్ లో మహేష్ ఒకరు. అసలు ఆయన ఏం తింటారు? ఏం తింటే అంత ఫిట్‌గా, చార్మింగ్‌గా ఉంటారు? అంటూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఆరా తీస్తూనే ఉంటారు. అంత హెల్దీ, ప్రొటీన్, న్యూట్రీషియస్ ఫుడ్ ఏం ఉంటుందనేది ఎవ్వరికీ అంతుబట్టని విషయం. అలాంటి వారందరికీ బెస్ట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మహేష్. తన బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్‌లో ఏం ఉంటుందో లీక్ ఇచ్చేశారు. ఆయన ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నారు. అక్కడ ఏం తింటున్నారనే విషయాన్ని ఓ పోస్టులో పెట్టేశారు.
ఓట్స్, నట్స్, సీడ్స్‌ని రాత్రంతా నానబెట్టి వాటిని పొద్దున్నే తీసుకుంటున్నారు. ఈ విషయాన్నే ``రాత్రి అంతా నానబెట్టిన ఓట్స్, నట్స్, సీడ్స్ ఇవి. నాకు మరి కొన్ని గంటల సేపు శక్తినివ్వడానికి ఇవి సరిపోతాయి`` అని క్యాప్షన్ రాశారు. గ్రీక్ గాడ్ ఆఫ్ టాలీవుడ్ అంటూ జనాలు పొగుడుతుంటారు మహేష్‌ని. మెయింటెయిన్ చేయలేక చచ్చిపోతున్నానని ఆయనే సరదాగా సర్కారువారిపాటలో అన్న మాటలని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.