English | Telugu
పవన్ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న డైరెక్టర్..!
Updated : Apr 2, 2016
పవన్ కళ్యాణ్ కు లక్షలాది మంది అభిమానులున్నారు. అలాంటి వాళ్లలో ఒక అభిమానికి పవర్ స్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తే..? ఎగిరి గంతెయ్యడూ..? అదే చేశాడు పవర్ సినిమా డైరెక్టర్ బాబి. చిన్నప్పటి నుంచీ చిరంజీవికి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బాబీ, ఆ అభిమానంతోనే డైరెక్టర్ గా మారాడు. కానీ తన రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని మాత్రం ఆయన కూడా అనుకోలేదు.
ఒకరోజు సాక్షాత్తూ పవనే తన ఫాం హౌస్ కు పిలిచి, సర్దార్ కథను బాబీ చేతిలో పెట్టి, మనం సినిమా చేస్తున్నాం అన్నాడట. ఆరోజు నుంచి ఈరోజు వరకూ, పవన్ తో పనిచేస్తూ అందులోని కిక్కును ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్టర్ బాబీ. పవన్ సినిమాలు మానేస్తానన్నారు కదా, దానిపై మీ కామెంట్ ఏంటి అని బాబీని అడిగితే, పవన్ అలా చేశారంటే ఆయన ఇంటి ముందు మొట్టమొదట ధర్నాకు నేనే దిగుతాను అంటున్నాడు. గతంలో పవన్ అభిమాని సినిమా డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో హరీష్ శంకర్ ' గబ్బర్ సింగ్ ' తో చూపించాడు. మరిప్పుడు బాబీ కూడా అదే టైప్ లో సర్దార్ సినిమాతో ఫ్యాన్ పవర్ చూపిస్తాడా..? లెట్స్ వెయిట్ అండ్ సీ..!