English | Telugu

ఆడియో రివ్యూ : సరైనోడు సాంగ్స్

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్లో సరైనోడు వస్తున్న సంగతి తెలిసిందే. ఆడియో ఫంక్షన్ పెట్టకుండా, సాంగ్స్ ను డైరెక్ట్ గా మార్కెట్ లోకి వదిలేశారు. మరి సాంగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకునే వాళ్లకోసం ఈ ఆడియో రివ్యూ. హావ్ ఎ లుక్.

అతిలోక సుందరి..
తమన్ రెగులర్ గా వాడే ఇన్ స్ట్రమెంట్స్ తోనే ఈ సాంగ్ ఇచ్చాడు. బీట్ బాగున్నా, ఆటో ట్యూనింగ్ కారణంగా, గత సినిమాల పాటలు గుర్తు రాక మానవు. షాడోలో పిల్లా మంచి బందోబస్తుగుందే సాంగ్ టైపులో సాగుతుంది. ఇలాంటివి పట్టించుకోకుండా ఓన్లీ బీట్ కోసమైతే హ్యాపీగా వినచ్చు. రామ జోగయ్య శాస్త్రి ఇచ్చిన లిరిక్స్ బాగున్నాయి.

యు ఆర్ మై ఎమ్మెల్యే..
స్టార్ట్ అవ్వగానే రేసుగుర్రంలో స్వీటీ సాంగ్ గుర్తొస్తుంది. సాంగ్ ముందుకు వెళ్లే కొద్దీ, కొత్త సాంగ్ అనే ఫీల్ లోకి వస్తాం. ఇది కూడా ఆటో ట్యూనింగ్ లా రోబోటిక్ గా అనిపిస్తుంది. ఇప్పటికే సినిమాలో క్యాథరిన్ ఎమ్మెల్యే అని వచ్చిన టాక్ ను బలపరిచేలా ఉంటుందీ సాంగ్. ఎమ్మెల్యే అంటే మై లవ్లీ ఏంజెల్ అని ఫినిషింగ్ ఇచ్చారు. అనంత శ్రీరామ్ ఇచ్చిన లిరిక్స్ యూత్ ఫుల్ గా ఉన్నాయి.

ప్రైవేట్ పార్టీ..
సాంగ్ టైటిలే ఈ సాంగ్ గురించి కంప్లీట్ గా చెబుతుంది. పూర్తి క్లబ్ మిక్స్ సాంగ్. ఫ్రెండ్స్ చిల్ అవుట్ అయ్యేప్పుడు వినే సాంగ్ ఇది. కృష్ణ చైతన్య ఇచ్చిన లిరిక్స్ మ్యూజిక్ లో కలిసిపోయాయి. విక్కీ, మానసి సాంగ్ ను ఆలపించారు.

బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే..
చిలకలూరి చింతామణి అంటూ సాగే ఈ ఐటెం సాంగ్, మొత్తం ఆల్బమ్ లో మంచి ఊపున్న సాంగ్. శ్రేయాఘోషల్, నాకాష్ అజీజ్, సింహా, శ్రీకృష్ణ, దీపు పాడారు. రామ జోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ థమన్ మ్యూజిక్ లో పెద్దగా వినబడే అవకాశం లేదు. బీట్ మాత్రం చాలా ఊపుగా ఉంటుంది. ఆటోవాలాలకు బాగా ఊపు తెచ్చే సాంగ్ ఇది.

తెలుసా తెలుసా..
శ్రీమణి రాసిన ఈ పాట లిరిక్స్ కు జుబిన్ నౌతియాల్, సమీర భరద్వాజ్ గొంతునందించారు. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య ఈ పాట వస్తుంది. ఆల్బం లో మెలోడీ సాంగ్ అంటే ఈ పాటనే చెప్పుకోవాలి. చాలా కూల్ గా సాగుతుంది. లాంగ్ డ్రైవ్ లో వినడానికి కరెక్ట్ గా సెట్ అయ్యే సాంగ్.

సరైనోడు..
ఇది టైటిల్ సాంగ్. మాస్ అండ్ క్లాస్ బీట్స్ ను మిక్స్ చేసి కొట్టాడు తమన్. బన్నీ బాడీ లాంగ్వేజ్ కు ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది. సినిమాలో లాస్ట్ సాంగ్ కావచ్చు. హార్ద్ కౌర్, బ్రిజేష్ శాండిల్య, సోనూ కక్కర్ ఆలపించారు. రామజోగయ్యశాస్తి లిరిసిస్ట్. ఇది కూడా ఆటోల్లో బాగా క్లిక్ అయ్యే సాంగ్.

ఓవరాల్ గా తెలుసా తెలుసా, బ్లాక్ బస్టరే, ఎమ్మెల్యే పాటలు ఛార్ట్ బస్టర్లుగా నిలుస్తాయి. మిగిలిన పాటలు ఊపు కోసం, బీట్స్ కోసం వినచ్చు. మెలోడీ లవర్స్ కు తెలుసా తెలుసా, పార్టీ లవర్స్ కు ప్రైవేట్ పార్టీ, మాస్ లవర్స్ కు సరైనోడు సాంగ్, బ్లాక్ బస్టర్ సాంగ్ నచ్చుతాయి. తమన్ తన ఆటో ట్యూనింగ్ వాడకపోయి ఉంటే, పాటలు ఇంకా మంచి పేరు తెచ్చుకుని ఉండేవేమో...

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.