English | Telugu
వర్మంటే నాకు చాలా ఇష్టమంటున్న పవన్ కళ్యాణ్..!
Updated : Apr 10, 2016
రామ్ గోపాల్ వర్మకు పవన్ గురించి ఏదో ఒకటి ట్వీటందే నిద్రపట్టదు. కానీ ఆయన గురించి పవన్ ఏమనుకుంటున్నాడో తెలుసా..? వర్మకు తనంటే చాలా ఇష్టమని, తనకు వర్మంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు పవన్. వర్మ ఫ్రస్టేషన్ లో ఉన్నాడని, తానేం చేసినా పిచ్ పెర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడని, అందుకే నేను హిందీలోకి వస్తుంటే అలా ట్వీట్ చేశాడని వర్మకు సపోర్ట్ గా మాట్లాడాడు పవర్ స్టార్. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. తనకు వర్మను ఏమీ అనాలనిపించదని, గతంలో వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అనే సినిమా తనకు చెప్తే, నచ్చక ఒప్పుకోలేదని, అప్పటి నుంచీ వర్మ తను నటించే సినిమాలు పెర్ఫెక్ట్ ఉండకపోతే విమర్శిస్తుంటాడని పవన్ అన్నాడు.
హిందీలోకి సినిమా వెళ్లడం గురించి, అక్కడ తక్కువ ఓపెనింగ్స్ రావడం గురించి కూడా పవన్ తన మనసులో మాట బయటపెట్టాడు. పెరుగుతున్న బడ్జెట్ దృష్ట్యా, మార్కెట్ పరిథులు పెంచుకోకపోతే నిర్మాతకు కష్టమవుతుందంటూ తన బాలీవుడ్ ప్రవేశం గురించి మాట్లాడాడు పవర్ స్టార్. సర్దార్ స్టోరీని తను చందమామకథలా రాశానని, ఖచ్చితంగా రాజా గబ్బర్ సింగ్ కూడా ఉంటుందని కుండబద్ధలుగొట్టేశాడు. అంతేకాక త్వరలోనే 2019 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమవుతానని కూడా మరోసారి స్పష్టం చేశాడు. ప్రస్తుతం పవన్ ఎస్.జే.సూర్య డైరెక్షన్లో కొత్త సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయబోతున్నాడని సమాచారం.