English | Telugu
వందో సినిమాకు బాలయ్య ఎక్కడా తగ్గట్లేదు..!
Updated : Apr 10, 2016
తన ల్యాండ్ మార్క్ మూవీ వందో సినిమా గౌతమీ పుత్రశాతకర్ణిని చాలా ప్రెస్టేజియస్ గా ప్లాన్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. కంచె లాంటి సినిమాతో జాతీయ అవార్డు కొట్టిన క్రిష్ ఈ సినిమాకు డైరెక్టర్ కావడం ఇప్పటికే సినిమాపై అంచనాల్ని మంచి స్థాయికి చేర్చేసింది. శాతకర్ణి సినిమాకు పనిచేసే ప్రతీ టెక్నీషియన్ ను బెస్ట్ ఉండాలని బాలయ్య ఖచ్చితంగా చెప్పేశారట. దానికి తోడు సినిమా ఒరిజినల్ గా ఉండాలని, ఎక్కడా స్టాండర్డ్స్ తగ్గని విధంగా గ్రాఫిక్స్ కూడా రావాలనేది క్రిష్ ఆలోచన. ఒకరకంగా చెప్పాలంటే, బాహుబలి లాంటి సినిమాను నిర్మించాలని పెట్టుకున్నారు బాలయ్య అండ్ క్రిష్. అందుకే సినిమాకు వాడే నగలను కూడా ఒరిజినల్ నే వాడాలని బాలయ్య అనుకుంటున్నారట. రాజుల సినిమా కావడంతో, బాలకృష్ణ పాత్రకు కూడా చాలా నగలు అవసరమౌతాయి. గిల్ట్ వాడటం కంటే, ఒరిజినల్ ను వాడితే, అవుట్ పుట్ కూడా క్వాలిటీగా వస్తుందని బాలయ్య ఫీలౌతున్నారట. ఇప్పటికే ఈ విషయమై అనేక జ్యూయలరీ బ్రాండ్స్ తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇప్పటికే రుద్రమదేవి సినిమాకు గుణశేఖర్ ఒరిజినల్ నగల్ని వాడిన సంగతి తెలిసిందే..