English | Telugu
జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ గుర్తించిన హృతిక్
Updated : Apr 11, 2016
ఎవరో పాట పాడితే హీరోలు స్టెప్పులేసే రోజులు పోయాయి. ప్రజంట్ హీరో తనంతట తానే పాట పాడుకుని తన పాటకి తానే స్టెప్పులేసుకుంటున్నాడు. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది యంగ్ టైగర్ ఎన్టీఆర్. అతని డైలాగ్ డెలివరీలో ఎంత స్పీడో,పాటలోనూ అంతే స్పీడ్.అతను పాడుతుంటే సీనియర్ సింగర్స్ పాడుతున్నట్లే ఉంటుంది. నందమూరి వంశంలో పాట పడిన హీరో అతనొక్కడే. ఇప్పటికే తను నటించిన సినిమాల్లో కొన్ని పాటలు పాడి ఆదుర్స్ అనిపించాడు .
యమదొంగ లో ..ఓలమ్మీ తిక్క రేగిందా అని తన తాత ఎన్ టీఆర్ పాటను ఈ జనరేషన్ హీరోగా పాడి శెభాష్ అనిపించుకున్నాడు. కంత్రీలో ...123 నేనొక కంత్రీ అనే పాట, రభసలో రాకాసీ... రాకాసీ సాంగ్, అదుర్స్ లో చారి చారి పాట, రీసెంట్ గా నాన్నకు ప్రేమతో...సినిమాలో ఐవన్న ఫాలో ఫాలో పాట పాడాడు. ఎన్ టీఆర్ టాలెంట్‌ను గుర్తించిన కన్నడ సూపర్ స్టార్ పునిత్ రాజ్‌కుమార్ తన చక్రవ్యూహలో గెలియా గెలియా అనే పాట పాడించుకున్నాడు. ఈ పాట కన్నడిగుల మనసుని గెలుచుకుంది. ఎన్టీఆర్‌తో పాటు పాడించుకోవాలనుకునే వారి కోవలోకి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చేరారు. త్వరలో విశాల్-శేఖర్ సంగీత దర్శకత్వంలో తను రూపొందించే ఆల్బమ్‌కు ఎన్టీఆర్ చేత పాట పాడించుకోవాలనుకుంటున్నాడు . హృతిక్ డిమాండ్‌కు జూనియర్ కూడా ఓకే చెప్పినట్టు ఫిలింనగర్ టాక్.