English | Telugu
బాబీని పవన్ ఎందుకు సెలెక్ట్ చేశాడంటే..?
Updated : Apr 6, 2016
గబ్బర్ సింగ్ దాదాపు హిట్స్ ఏమి లేని టైంలో పవన్ అంటే ఎంటో మరోసారి ఇండస్ట్రీకి తెలియజేసిన సినిమా. పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలని కామన్ ఆడియన్ కోరుకుంటాడో అలా పవర్ స్టార్‌ను ప్రజంట్ చేశారు డైరెక్టర్ హరీశ్ శంకర్. హై ఎక్స్‌పెక్టెషన్స్ మధ్య రిలీజైన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్‌తో..పవన్ కెరిర్‌లోనే మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని డిసైడయ్యారు పవన్.
అప్పటికే రచ్చ సినిమాతో రాంచరణ్‌కి హిట్ ఇచ్చిన సంపత్ నంది కళ్యాణ్ దృష్టిలో పడ్డాడు. వెంటనే శరత్ మరార్ అండ్ కో సంపత్‌ని అప్రోచ్ అవ్వడం సంపత్ కథ వినిపించడం అది పవన్‌కి నచ్చడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే పవన్ కొన్ని మార్పులు సజెస్ట్ చేయడంతో సంపత్ స్టోరీని రీరైడ్ చేసేందుకు ట్రై చేశాడు. టైం స్పాన్ పెరిగిపోవడం, స్కిప్ట్ రెడీ కాకపోవడంతో సంపత్ ప్లేస్‌లో యంగ్ డైరెక్టర్ బాబీ స్క్రీన్ మీదకు వచ్చాడు.
రవితేజతో తీసిన పవర్ మంచి హిట్ అవ్వడం మాస్ ఎలిమెంట్స్ బాగా ప్రజంట్ చేయడంతో బాబీని డైరెక్టర్‌గా కన్ఫామ్ చేశాడు పవన్. ఆయనే స్వయంగా స్టోరీని సమకూర్చగా, స్క్రిప్ట్ వర్క్ మాత్రం బాబీకి అప్పగించాడు. పవన్ నమ్మకాన్ని బాబీ వమ్ము చేయలేదు. సాంగ్స్, ఫైట్స్, పిక్చరైజేషన్ ఇలా పవన్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో సర్దార్ గబ్బర్ సింగ్‌ను రెడీ చేశాడు. ఉగాది కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.