English | Telugu
హీరో రాజశేఖర్ తో గొడవ పడిన దర్శకుడు..!
Updated : Apr 6, 2016
తేజ దర్శకత్వంలో రాజశేఖర్ అనగానే అందరూ షాక్ తిన్నారు. ఇదేం కాంబినేషన్.. ఎలా సెట్టవుద్ది?? అంటూ ఆశ్చర్యపోయారు. తేజ.. రాజశేఖర్‌ని విలన్ గా చూపిస్తున్నాడు అనగానే మరింత ఇదైపోయారు. మొత్తానికి కాస్త ఆలస్యంగా అయినా రాజశేఖర్ మంచి నిర్ణయం తీసుకొన్నాడనుకొన్నారు. అయితే.. ఈ కాంబినేషన్‌కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సినిమా ఇంకా మొదలవ్వకముందే.. తేజ - రాజశేఖర్ ఇద్దరి మధ్య గొడవ రాజుకొందట. ఇద్దరూ నువ్వా, నేనా అనుకొన్నార్ట. దాంతో.. ఈ సినిమా నుంచి రాజశేఖర్ బయటకు వచ్చేశాడన్న టాక్ గుప్పుమంది.
టైమ్‌కి రాడన్న ముద్ర రాజశేఖర్ పై బలంగా పడిపోయింది. తేజకు కోపం ఎక్కువన్న సంగతీ తెలిసిందే. ఇదే.. ఇప్పుడు వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణమని తెలుస్తోంది. స్టోరీ సిట్టింగ్స్‌కి, డిస్కషన్స్‌కి రాజశేఖర్ చెప్పిన టైమ్‌కి ఎప్పుడూ రాలేదట. దాంతో తేజకి కోపం వచ్చి రాజశేఖర్‌ని మొహం మీదే తిట్టేశాడట. రాజశేఖర్‌కీ కోపం అదే లెవల్లో ఉంటుంది కదా?? దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. రాజశేఖర్ ఉంటే ఈసినిమా ఇంకోస్థాయిలో ఉంటుందని భావించాడు తేజ. కానీ.. ఇప్పుడు ఆయనే తుర్రుమన్నాడు. మరి తేజ మరొకరితో సర్దుకుపోతాడా, లేదంటే రాజశేఖర్‌ని కూల్ చేస్తాడా? అన్నది ఆసక్తిగా మారింది.