English | Telugu
పవన్ అంటే ఎందుకంత క్రేజ్
Updated : Apr 6, 2016
పవన్ కళ్యాణ్ ఈ పేరుకున్న పవర్ అంతా ఇంతా కాదు. తెరపైనే కాదు నిజజీవితంలోనూ తన ప్రవర్తన ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవన్. పవన్ అంటే ప్రాణం పెట్టేవారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు . ప్రపంచం మొత్తం ఉన్నారు. ఫేస్‌బుక్‌కు ముందు అర్కుట్ పేజిలో పవన్ ఫ్యాన్స్ పేజీ ఇండియాలోనే అతిపెద్దదంటే పవన్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అసలు పవన్‌కు అంత క్రేజ్ ఎలా వచ్చింది. సమకాలీన హీరోల్లో ఏకంగా గాంధీయిజంలాగా పవనిజం ప్రభంజనం ఎందుకైంది.
* చాలా మంది హీరోలు సినిమాల్లోకి వచ్చేదాకా ఒకలా అణిగిమణిగి ఉంటారు. కాస్త స్టార్ డమ్ రాగానే తనంతటి వారు లేరన్నట్టు బిల్డప్ ఇస్తారు. కాని పవన్ అలా కాదు సినిమాల్లోకి వచ్చి రెండు దశాబ్ధాలు గడుస్తున్నా సెట్‌లో తనపని తాను చూసుకుని వెళ్లిపోతారు.
*మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా గతిని మార్చింది పవన్ కళ్యాణే. హీరో అంటే కుటుంబం కోసం కష్టపడి మనసున్న మారాజులా ఉంటాడు అన్నరూల్స్‌ను పక్కకునెట్టి, వెరైటీ హావభావాలు, డిఫరెండ్ కాస్ట్యూమ్స్‌తో హీరో లుక్‌ని మార్చేశారు పవన్.
*సాయం చేసే మనుషులే కరువైపోతున్న ఈ రోజుల్లో సాయం చేయడమే పెద్ద విషయం. చిటికెడు సాయం చేసి కొండంత పబ్లిసిటి చేసుకుంటారు. కానీ పవన్ రూటే సెపరేటు. విపత్తుల భారిన పడి ప్రజలు సర్వం కోల్పోయిన తరుణంలో నేనున్నానంటూ ముందుగా స్పందించేది పవన్ ఒక్కరే. ఇక ఆయన దారిలో సినీపెద్దలు. ప్రముఖులు వచ్చి చేరుతారు.
* మృత్యువుతో పోరాడుతూ తనను చూడాలనుకుంటున్న ఎందరో చిన్నారుల ఆఖరి కోరికను తీర్చి మానవత్వమున్న మనిషినని మరోసారి రుజువు చేశాడు.
పవన్ లోని ఈ అంకిత భావం,. సేవాథృక్పధం, అన్ని అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. అందుకే సమకాలీన హీరోల్లో ఎవరికి లేని క్రేజ్ పవన్ సొంతం చేసుకున్నారు. కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో నీరాజనాలందుకుంటున్నారు.