English | Telugu
పెళ్లికాని పిల్ల ప్రేమ కథ!
Updated : Jun 19, 2013
"సొంత ఊరు, గంగపుత్రులు" వంటి సినిమాలు రూపొందించిన సునీల్‌కుమార్‌రెడ్డి.. ఆ మధ్య "ఒక రొమాంటిక్ క్రైమ్ కథ" అనే సినిమా తీసి నాలుగైదు కోట్లు వెనకేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కోవలో "ఓ పెళ్లి కాని అమ్మాయి ప్రేమ కథ" అంటూ మరో సినిమా తీస్తున్నాడు.
నెలలు నిండి డెలివరీకి సిద్ధంగా ఉన్న ఓ తీనేజ్ అమ్మాయితో సునీల్‌కుమార్‌రెడ్డి డిజైన్ చేయించిన పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే విధంగా ఈ పోస్టర్స్ పై "ఆఫ్టర్ _ మంత్స్" అనే క్యాప్షన్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. "ఒక రొమాంటిక్ క్రైమ్ కథ" చిత్రానికి కూడా ఇలాగే.. "ప్రతి పరదా వెనుక ఒక కథ" అంటూ ముఖాలకు ముసుగులు కప్పుకున్న అమ్మాయిలతో డిజైన్ చేయబడిన పోస్టర్స్.. ఆ సినిమాపై జనం దృష్టి మళ్లేలా చేసాయి. తాజా పోస్టర్స్‌లోనూ సదరు ముసుగు అమ్మాయిల స్టిల్స్‌ను వాడుకుంటూ.. "ఫ్రం ది మేకర్స్ ఆఫ్" అంటూ హల్‌చల్ చేస్తున్నారు.
మారుతి దర్శకత్వం వహించిన "ఈరోజుల్లో", "ఒక రొమాంటిక్ క్రైమ్ కథ" చిత్రాలు ఇంచుమించుగా ఒకేసారి వచ్చాయి. రెండూ లాభాల పంట పండించాయి! సునీల్‌కుమార్‌రెడ్డి ఈ చిత్రంతోపాటు "నేనేం చిన్నపిల్లనా?" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.