English | Telugu
డామిట్..పవన్ చేతులెత్తేశాడు..!
Updated : Apr 20, 2016
సర్దార్ గబ్బర్ సింగ్.. బయ్యర్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పేరు. ఎన్నో ఆశలు పెట్టుకొన్న ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర.. బోర్లా పడింది. కోట్లు పోసి కొన్న బయ్యర్లు..ఇప్పుడు పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయారు. చాలా చోట్ల సగానికంటే ఎ ఎక్కువ సొమ్ములు పోయాయి. అందుకే పంపిణీదారులు మొత్తం... 'ఆదుకో.. పవన్' అంటూ మొరపెట్టుకొంటున్నారు. పవన్ మంచితనం గురించి తెలిసిన బయ్యర్లు నిన్నటి వరకూ... కాస్త ధీమాగానే ఉన్నారు. జాని సినిమా సమయంలో.. బయ్యర్లు ఇలానే తీవ్రంగా నష్టపోతే, వాళ్లందరికీ దగ్గరుండి నష్టపరిహారం ఇప్పించాడు. సేమ్ ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురైంది. దాంతో పవన్ అప్పట్లానే ఆదుకొంటాడనుకొన్నారు. కానీ పవన్ ఇప్పుడు సడన్‌గా చేతులెత్తేసినట్టు సమాచారం.
ఈమధ్య కొంతమంది బయ్యర్లు పవన్‌ని కలుసుకొని తమ గోడు వెలుబుచ్చారు. అప్పుడు పవన్ సానుకూలంగానే స్పందించాడు. ఇప్పుడు మాత్రం.. ''ఈ సినిమా వల్ల శరత్ మరార్ కూడా నష్టపోయారు. ఆయన్ని నష్టాన్ని భర్తీ చేయడమనడం భావ్యంకాదు'' అంటున్నాడట. దాంతో బయ్యర్లు లబోదిబోమంటున్నారు. అయితే.. పవన్ వాళ్లకు ఓ ఆప్షన్ ఇచ్చాడు. ఎస్.జె.సూర్యతో చేస్తున్న సినిమాని సర్దార్ సినిమాకొన్న బయ్యర్లకే తక్కువ రేటుకి ఇస్తానని పవన్ మాటిచ్చాడట. దాంతో.. బయ్యర్లు కాస్త ఉపశమనం లభించినట్టైంది. మనలో మన మాట... ఎస్.జె సూర్య సినిమా కూడా పోతే.. అప్పుడు పరిస్థితేంటి? గతంలో ఇలానే ఆంధ్రావాలా పోతే ఎన్టీఆర్.. బయ్యర్లున ఆదుకోవాలనుకొన్నాడు. నా అల్లుడు సినిమా తీసి సగం రేట్లకే ఇచ్చేశాడు. ఆ సినిమా కూడా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు పవన్ విషయంలోనూ అదే జరుగుతుందా? డౌటే.