English | Telugu
సరైనోడు రన్ టైం లాక్ అయింది..!
Updated : Apr 20, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వస్తున్న సినిమా సరైనోడు. ఏప్రిత్ 22న విడుదల కానున్న సరైనోడు రిలీజ్ కోసం మూవీ టీం ప్రమోషన్లతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు బోయపాటి కూడా సినిమా రన్ టైం ను లాక్ చేయించాడట. సరిగ్గా రెండు గంటల నలభైనిముషాలకు సినిమా టైం ను ఫిక్స్ చేయించాడట బోయపాటి. రెండున్నర గంటలకు మించి సినిమా రన్ టైం ఈ మధ్య కాలంలో ఉండట్లేదు. అలాంటిది మరో పది నిముషాల ఎక్స్ ట్రా టైం అంటే, బోయపాటి ధైర్యం చేస్తున్నట్టే. రన్ టైం తగ్గే కొద్దీ సినిమాలో షార్ప్ నెస్, స్పీడ్ పెరుగుతుంది. కానీ సినిమాలో పట్టుంటే మాత్రం, రన్ టైం మూడు గంటలున్నా జనాలు చూస్తారు. ప్రస్తుతానికి బోయపాటి అదిరిపోయే తరహాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ను డిజైన్ చేశాడనే వార్త వినిపిస్తోంది. సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్స్ లో ఒకటిగా నిలవనుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి పూర్తి మీసకట్టుతో, డిఫరెంట్ గెటప్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేయడం విశేషం.