English | Telugu
సరైనోడు డైలాగ్ ప్రోమో రిలీజ్..!
Updated : Apr 20, 2016
రకుల్ ప్రీత్ : అయితే మీకు పనీ పాటా లేదు
అల్లు అర్జున్: యా..ఫ్రీ..
రకుల్ ప్రీత్ : పైగా రోజూ రెండు గొడవలు..
అల్లు అర్జున్: హా..పక్కా..
ఇవీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన సరైనోడు డైలాగ్ ప్రోమో లోని డైలాగులు. కేవలం 11 సెకన్ల డ్యూరేషన్ తో ఉన్న ఈ టీజర్ ఇప్పుడు ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ, సినిమాలోని ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ ను కూడా చూపిస్తూ, ప్రమోషన్స్ లో ఎగ్రెసివ్ గా ఉంది సరైనోడు టీం. ఇప్పటికే మెగా హీరోల సినిమాలు డిజాస్టర్లుగా మిగలడంతో, ఇప్పుడు మెగా ప్యాన్స్ ఆశలన్నీ సరైనోడిపైనే ఉన్నాయి. ఈ నెల 22న థియేటర్లలోకి సరైనోడి సందడి మొదలవుతోంది. బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో సినిమా కావడంతో, మూవీ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినీజనాల్లో కనిపిస్తోంది. మరి బన్నీ మెగా హిట్ కొడతాడో లేదో తెలియాలంటే, మరో రోజు వెయిట్ చేయాల్సిందే మరి.