English | Telugu
పవన్ బైక్ ను కొన్న కన్నడ స్టార్ హీరో..!
Updated : Apr 6, 2016
బాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్టయిన ఓమైగాడ్ సినిమాను తెలుగుతో విక్టరీ, పవర్ స్టార్ కాంబినేషన్లో తెరకెక్కించారు. ఇక్కడ కూడా సినిమా ఘనవిజయాన్ని సాధించింది. అన్నింటికంటే ముఖ్యంగా దేవుడిగా పవన్ డ్రస్సింగ్, మ్యానరిజం, కీచైన్, బైక్ లు ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగులో పవన్ వాడినవాటినే రీమేక్ సినిమాలో కూడా వాడాలని అనుకుంటున్నారట. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ఈగ సుదీప్, ఉపేంద్రలు భగవంతుడు భక్తుడుగా కనిపించబోతున్నారు. సుదీప్ తన డ్రెస్సింగ్ నుంచి స్టైల్ వరకూ యాజ్ ఇటీజ్ పవన్ ను ఫాలో అయిపోవాలని ఫిక్సయ్యాడట. అందుకే పవన్ బైక్ ను ఏకంగా 8 లక్షలు పెట్టి కొని, కన్నడ గోపాలగోపాల కు వాడుతున్నారట. ఈ సినిమాకు ముకుందా మురారి అనే పేరును కన్ఫామ్ చేశారు. ఇక్కడ శ్రియ నటించిన పాత్రలో ప్రేమను తీసుకున్నారు. కన్నడంలో స్టార్ ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరూ కలిసి అదే మ్యాజక్ ను రిపీట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.