English | Telugu
అక్కినేని అఖిల్ సెకండ్ సినిమా ఫిక్సయిందా..?
Updated : Apr 6, 2016
తనకు హిట్ ఇచ్చిన దర్శకులను, కొడుకుల సినిమాలకు ప్రిఫర్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. సోగ్గాడే చిన్ని నాయనాతో సంక్రాంతి హిట్టించిన కళ్యాణ కృష్ణను పెద్ద కొడుకు నాగచైతన్య సినిమాకు ఫిక్స్ చేసిన నాగ్, లేటెస్ట్ గా ఊపిరిని తెరకెక్కించిన వంశీ పైడిపల్లితో రెండో కొడుకు అఖిల్ సినిమాను ఫిక్స్ చేశారు. ఊపిరి విడుదలైనప్పటి నంచీ విమర్శకుల ప్రశంసలు పొందుతూ దూసుకుపోతోంది. సున్నితమైన అంశాలను తెరపై బాగా ఆవిష్కరించగలడని తనకున్న పేరును మరింత బలపరుచుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అఖిల్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను వంశీ సిద్ధం చేశాడట. మొదటి సినిమా అఖిల్ తో కాస్త తడబడ్డ అక్కినేని చిన్నబ్బాయికి, రెండో సినిమా విజయం చాలా కీలకంగా మారింది. ఎటాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్న అఖిల్ కు వంశీ పైడిపల్లితో సినిమా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.