English | Telugu
కమల్ కు వార్నింగ్ ఇచ్చిన రాంగోపాల్ వర్మ..!
Updated : Apr 6, 2016
రాంగోపాల్ వర్మ కమల్ కు వార్నింగ్ ఇచ్చాడు. కేవలం పవన్ కోసమే వర్మ ఈ పని చేశాడు. వర్మకు పవన్ పై అభిమానమా లేక పబ్లిసిటీపై ఆరాటమా అన్నది తెలియదు గానీ, ఎప్పుడూ తన ట్వీట్లతో పవన్ అభిమానుల్ని కెలకందే ఆయనకు నిద్రపట్టదు. తాజాగా ఇలా తిట్టీ తిట్టనట్టుగా వర్మ చేసిన ఒక ట్వీట్ కు కమాల్ ఖాన్ రిప్లై ఇచ్చాడు. ఆ ట్వీట్ కు వర్మ మళ్లీ కౌంటరేసి, కమాల్ ఖాన్ కు ఝలక్ ఇచ్చాడు. విషయంలోకి వెళ్తే, బాహుబలి రిలీజ్ రోజున ఒకటిన్నర కిలోమీటర్ల మేర లైన్ ఉందని, మరి ప్రభాస్ కంటే భీభత్సమైన ఇమేజ్ ఉన్న పవర్ స్టార్ సినిమా సర్దార్ రిలీజ్ కు ఎన్ని కిలోమీటర్ల లైన్ ఉండాలి అంటూ అభిమానుల్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు.
దానికి రిప్లై ఇస్తూ కమాల్ ఖాన్ జీరో కిలోమీటర్స్ అని సెటైర్ వేశాడు. వర్మ కు కోపం వచ్చిందో, లేక మామూలుగా తిట్టాడో గానీ, మిస్టర్ కేఆర్కే ప్లీజ్ స్టాప్ టాకింగ్ నాన్సెన్స్ ఎబౌట్ సూపర్ స్టార్ పీకే. నాకు తెలిసి ముంబైలో కూడా ఒకటిన్నర కిలోమీటర్ల లైన్ ఉంటుంది అంటూ రిప్లై ఇచ్చాడు. ఇప్పటి వరకూ పవన్, ప్రభాస్ అభిమానులెవరూ బాహుబలికి, సర్దార్ కు కంపేరిజన్స్ చేయలేదు. అందుకే వర్మ గారు కాస్త అగ్గి రాజేస్తున్నట్టున్నారు. ఇంతకూ వర్మ అన్నట్టు నిజంగానే రిలీజ్ రోజు లైన్ 2 కిలోమీటర్లు దాటుతుందేమో చూడాలి.