English | Telugu
నయనతార లవ్ అఫైర్ మళ్లీ బ్రేకప్ అయిందా..?
Updated : Apr 5, 2016
చూడబోతే నయనతారకు పాపం ప్రేమ అచ్చొచ్చినట్టు లేదు. ఎంతమందితో ప్రేమాయణాలు నడిపినా, అవి చివరికి పెటాకులుగానే మిగిలిపోతున్నాయి. తన సినిమాల కంటే లవ్ ఎఫైర్లతోనే బాగా ఫ్యామస్ అయింది. మొదట శింబుతో మన్మథ సినిమా టైంలో ఘాటుగా లవ్ స్టోరీని నడిపింది. వీళ్లిద్దరికీ సంబంధించిన చాలా ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇద్దరూ బ్రేకప్ అయిపోయారు. ఈ బ్రేకప్ ఎఫెక్ట్, చాలా కాలం వరకూ నయనను వేధించింది. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం మొదలైంది. ఇద్దరూ దాదాపు పెళ్లి పీటల వరకూ వచ్చేసిన టైం కి, ఆ రిలేషన్ కూడా బాల్చీ తన్నేసింది. నిజానికి అప్పటికి శ్రీరామరాజ్యం చేస్తున్న నయన, ఇక ఆ సినిమాతో కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి, ప్రభుదేవాతో సెటిల్ అయిపోదామని కూడా అనుకుంది. కానీ అవేమీ జరగలేదు. ఇక ముచ్చటగా మూడో కథ, నేనూ రౌడీనే సినిమా దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో జరిపింది. మొదట పుకారే అని అందరూ అనుకున్నా, అతన్ని హగ్ చేసుకుని ఉన్న ఫోటోను నయన తన వాట్సాప్ ఫ్రొఫైల్ పిక్ గా పెట్టడంతో, విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారం కూడా హుళక్కయ్యేలా ఉందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. పెళ్లి చేసుకుందామని విఘ్నేశ్ అంటుంటే, ఆఫర్లు వస్తున్నప్పుడు వదిలెయ్యడమెందుకు, అవకాశాలు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుందామని నయన అంటోందట. దీంతో ఇద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి, బ్రేకప్ కు చాలా దగ్గరగా వెళ్లిందట. మరి ఈ బంధాన్నైనా నయన నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి మరి.