English | Telugu
సర్దార్ టిక్కెట్ల కోసం ఇల్లు అమ్మిన అభిమాని
Updated : Apr 5, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకున్న క్రేజ్ అలాంటి ఇలాంటిది కాదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లోనూ, ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలుంటాయి. రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వగానే అంతకు ముందు నుంచే టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్ కోసం థీయేటర్లలోనూ, ఆన్‌లైన్‌లోనూ అభిమానులు క్యూ కడతారు. తాజాగా పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాది కానుకగా ఈ నెల 8న థియేటర్లలోకి వస్తోంది. పండగ దానికి తోడు వారంతం కావడంతో టిక్కెట్స్ కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది.
ఇప్పటికే ఫస్ట్ డే అన్ని షోల బుకింగ్స్ ఫుల్లయిపోయాయి. రెండు సంవత్సరాల తర్వాత పవన్ సినిమా వస్తుండటంతో అభిమానులు టిక్కెట్ల కోసం ఇప్పటికే యుద్ధాలు మొదలుపెట్టారు. ఇక కర్నూలు జిల్లాలో ఓ అభిమాని తన ఆరాధ్య నటుడి కోసం 10 లక్షల ఇల్లు అమ్మేసి టిక్కెట్లు కొన్నాడట. ఈ మాట ఆనోటా, ఈ నోటా మారు మ్రోగిపోతోంది. దీనిని బట్టి పవన్ అంటే ఎంత అభిమానామో మాటల్లో చెప్పలేం. అందుకే పవనిజం అంతగా మారుమోగుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే సినిమా రిలీజైన తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.