English | Telugu
ప్రత్యూష హత్య కేసులో లేటెస్ట్ ట్విస్ట్..!
Updated : Apr 5, 2016
ప్రత్యూష బెనర్జీ హత్య కేసులో కొత్త ట్విస్ట్. ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్, ఆమెను హత్య చేసి ఉంటాడని ఒక కోణంలో అతన్ని విచారించిన పోలీసులు తాజాగా అతని మీద కేసు నమోదు చేశారు. ఆమెను ఆత్మహత్య చేసుకునేలా, అతను ప్రేరేపించాడంటూ కేసులో పోలీసులు పేర్కొన్నారు. బాలికా వధు సీరియల్ తో ఫ్యామస్ అయిన ప్రత్యూష బెనర్జీ, తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెను హాస్పిటల్లో చేర్పించి, తను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు రాహుల్. దీంతో అతని మీద అనుమానం పెరిగింది. ప్రత్యూష స్నేహితులందరూ, అతను ఆమెను హింసించేవాడని, అతనే హత్య చేసినా అనుమానం లేదని చెబుతుండటంతో అతన్ని విచారించారు పోలీసులు. కానీ ఆరోగ్యం బాలేదంటూ హాస్పిటల్లో చేరి, విచారణ నుంచి తప్పుకునే ప్రయత్నం చేశాడు రాహుల్. తాజాగా సూసైడ్ కు ప్రేరేపించాడంటూ, పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానిజాలు మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా బయటికొచ్చే అవకాశం ఉంది.