English | Telugu
సర్దార్ ఆడియో సాక్షిగా మెగాబ్రదర్స్ కౌగిలింత
Updated : Mar 20, 2016
హైదరాబాద్ నోవోటెల్ లో గ్రాండ్ గా మొదలైంది సర్దార్ పాటల పండగ. అభిమానుల సందడి మధ్య, దేవీ పాటల ఊపులో సందడిగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ తో అభిమానుల అరుపులకు ఆకాశమే హద్దుగా మారింది. చాలా రోజుల నుంచీ మెగా అండ్ పవర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మూమెంట్ సర్దార్ ఆడియోలో ఎదురైంది. పవన్ కళ్యాణ్, చిరు ఆప్యాయంగా కౌగలించుకున్నారు. దాంతో ఆ ఫోటోను బంధించడానికి మీడియా, చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. చిరు కొత్త లుక్ సన్నబడి, కొంచెం గడ్డంతో అదరగొడితే, పవన్ తన మార్క్ సింపుల్ క్లాసిక్ డ్రస్సింగ్ తో ఇన్ షర్ట్ లో వచ్చారు. చిరు ఎప్పుడు మాట్లాడతారో, పవన్ ఎప్పుడు మాట్లాడతారోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.