English | Telugu

పవన్ కళ్యాణ్ అంటే నాకు గుర్తొచ్చేది ఆ మాటే - త్రివిక్రమ్

సర్దార్ ఆడియో వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ..." కాళ్లే వేళ్లై నడిచే చెట్టు మనిషి అన్నారొక కవి. నా దృష్టిలో ఆవేశం ఆదర్శం కాళ్లై నడిచే మనిషి పవన్ కళ్యాణ్. ఆయన్ను చూసినప్పుడు నాకు ఒకటే మాట గుర్తొస్తుంది. నేను పిడికెడు మట్టే కావచ్చు. కానీ ఒక దేశపు జెండాకున్నంత పొగరు నాకుంది అన్న మాట నాకు గుర్తొస్తుంది పవర్ స్టార్ ను చూస్తే. అలాంటి పొగరుకు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తూ, ఈ సినిమా ఆయనకు చాలా ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. మన తెలుగు సినిమా పరిథుల్ని మరింత ముందుకెళ్లాలని, మన విస్తృతి మరింత పెరగాలని, భారతీయ సినీ పరిశ్రమ అంతా ఒకటి కావాలని కోరుకంటూ, అది సర్దార్ తో మొదలవుతుందని భావిస్తున్నాను. " అన్నారు

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.