Read more!

English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ సెన్సేషన్

రిలీజయ్యాక ఏం చేస్తాడో తెలీదు కానీ, పవన్ సర్దార్ రిలీజ్ కు ముందే రికార్డులు కుమ్మేస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 8 న ఒకేసారి సర్దార్ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకింగ్ వీడియోలు, టీజర్లతో సోషల్ మీడియాలో కాక పుట్టించిన సర్దార్ కు సంబంధించిన ప్రతీ న్యూస్ సెన్సేసషనల్ అవుతోంది. మూవీ బిజినెస్ లో, ఫ్యాన్ ఫాలోయింగ్ లో తిరుగులేని రికార్డ్ ఉన్న పవన్ కళ్యాణ్, తన సినిమాను 40 కు పైగా దేశాల్లో రిలీజ్ చేస్తున్నాడు. ఓవర్సీస్ లో కూడా పవన్ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. దీంతో ఆ మార్కెట్ ను ఫుల్ గా క్యాష్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇండియా వైడ్ గా మాత్రమే కాక, అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలు, యూరప్ దేశాలు, గల్ఫ్ దేశాల్లో సర్దార్ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. తెలుగు, హిందీ వెర్షన్లను కూడా ఆ దేశాల్లో రిలీజ్ చే్స్తున్నారు. సర్దార్ హిట్ కొట్టిందటే రికార్డులన్నీ రీప్లేస్ అవడంతో పాటు, పవన్ పేరు మారుమోగిపోతుందనడంలో డౌట్ లేదు. మరి సర్దార్ ఏం చేస్తాడో చూడాలి.