English | Telugu

మోహన్ బాబు విలక్షణ నటుడు ఎందుకయ్యారో తెలుసా...?

భక్తవత్సలం నాయుడు అన్న పేరు చెబితే ఆయన్ని ఎవరూ గుర్తుపట్టలేకపోవచ్చు. మోహన్ బాబు అని చెప్పగానే వెంటనే అందరికీ బల్బులు వెలుగుతాయి. తేడా ఏంటో తెలుసా..? భక్త వత్సలం నాయుడుగా ఉన్నప్పుడు కేవలం సాదాసీదా పీటీ టీచర్. కానీ మోహన్ బాబు అన్న వ్యక్తి మాత్రం రాత్రనక పగలనక కష్టపడి, స్వయం కృషితో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. మోహన్ బాబును వెర్సటాలిటీ ఉన్న యాక్టర్ గా ఎందుకంటారో తెలుసా..? ఆయన టాప్ డైలాగులు చూస్తే, ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికేస్తుంది.

పెదరాయుడు

" ది రిలేషన్ షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఏ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు. అసలు అర్ధమే లేదనుకుంటే క్షమించు " ఈ డైలాగ్ చాలు, మోహన్ బాబు మార్క్ చూపించడానికి. నేటికీ దీన్ని చాలా మంది తమ మాటల్లో సరదాగా వాడుతుంటారు

అసెంబ్లీ రౌడీ

అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా..ఖబడ్డార్...

రాయలసీమ రామన్న చౌదరి

గుర్రానికి కాళ్లల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి కంట్లో బలం, ఈ రామన్న చౌదరికి ఒళ్లంతా బలమేరా..

సర్దార్ పాపారాయుడు

" మీ భారతీయులు మాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు. మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు " అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగ్ సూపర్ ఫ్యామస్.

రౌడీ

సింహం అవ్వాలని ప్రతీ కుక్కకీ ఉంటుంది. కానీ అడవిలో గర్జించడానికి, వీధిలో మొరగడానికి మధ్య గల తేడాని ఏనాటికైనా నువ్వు గుర్తిస్తావని ఆశిస్తున్నాను

ఒకటా రెండా...మోహన్ బాబు ప్రతీ సినిమాలోనూ పలికిన ప్రతీ డైలాగూ ఆణిముత్యమే. అక్కడ డైలాగ్ లో ఏమీ ఉండదు. కేవలం ఆయన దాన్ని పలికించిన విధానమే ఆ డైలాగ్ ను ఎలివేట్ చేస్తుంది. విలన్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన డైలాగ్ డెలివరీని ఆ తర్వాత చాలా మంది ఇమిటేట్ చేశారు. హీరోగా చేసిన ప్రతీ సినిమాలోనూ తన మార్క్ స్పష్టంగా వేశారు. ఆందుకే ఆయన డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ గా ప్రజల మనసుల్లో పద్మశ్రీ గా ముద్ర వేశారు. ఈరోజు మోహన్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలని, మరిన్ని గుర్తుండిపోయే డైలాగులతో మనల్ని మరింత రజింపజేయాలని కోరుకుందాం..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.