English | Telugu
జగపతిబాబు ఆత్మగా చేస్తున్నాడు
Updated : Mar 16, 2016
హీరోగా కాస్త షైన్ తగ్గగానే, నైస్ గా విలన్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయాడు జగ్గూ భాయ్. బేస్ వాయిస్, రఫ్ లుక్స్, మంచి ఫిజిక్ తో మంచి డిమాండ్ ఉన్న విలన్ గా మారిపోయాడు. కేవలం క్యారెక్టర్ కే కాక, సినిమాకు కూడా బాబు గారి వెయిట్ యాడ్ అవుతోంది. అందుకే దర్శకనిర్మాతలు ఆయన్ని ప్రిఫర్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, తన తర్వాతి సినిమాలో జగపతి బాబు ఆత్మగా కనబడబోతున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ ఇషాకు తండ్రి పాత్రతో పాటు, ఆత్మగా జగ్గూ భాయ్ హల్ చల్ చేయబోతున్నాడట. నాన్నకు ప్రేమతో తర్వాత జగపతి మీద ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. మరి ఆత్మగా జగ్గూభాయ్ ఎలా ఇరగదీస్తాడో చూడాలి.