English | Telugu
ఖుషీ తర్వాత సినిమాలు మానేద్దామనుకున్నా - పవన్
Updated : Mar 19, 2016
పవన్ ఖుషీ తర్వాత సినిమాలు మానేద్దామనుకున్నారా..? సినిమాలు చేయడం ఆయనకు ఇష్టం లేదా..? అవునంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ రోజు ప్రెస్ మీట్లో పవన్ ఆసక్తికర అంశాల్ని విలేకరులతో షేర్ చేసుకున్నారు. ఖుషీ హిట్ అయిన తర్వాత వరస ఫ్లాపులు లేకపోయి ఉంటే, ఈపాటికే సినిమాలు మానేసి ఉండేవాడినన్నారాయన. కానీ ఫ్లాపులు రావడంతో, హిట్ కోసం మళ్లీ సినిమాల్లో పడ్డారట. సినిమాలు చేయడం ఆయనకు ఏదో తెలియని అలసటగా ఉంటుందట.
అందరూ అనుకుంటున్నట్లు పవన్, పాలిటిక్స్ కోసం సినిమాలు మానేయట్లేదు. ఆయనకు దశాబ్దం క్రితం నుంచే ఈ ఆలోచన ఉంది. సినిమాలు చేసే ఆసక్తి ఆయనలో తగ్గిపోయింది. ఇప్పుడు ఎలాగూ ప్రజాసేవలోకి వెళ్తున్నారు కాబట్టి, ఆ విషయాన్ని పైకి చెప్పేశారు పవన్. ఇంకో రెండో మూడో సినిమాలు మాత్రమే పవర్ స్టార్ చేస్తారట. మరి మీకున్న ఫాలోయింగ్ అంతా సినిమాల గురించే. అవి మానేస్తే ఆ స్టార్ డం పోతుంది కదా అని విలేకరి అడిగితే, ప్రాణం అయితే ఉంటుంది కదా అన్నారు పవన్. స్టార్ డమ్ నాకు ఎక్కువ కాదు, అది వదిలేసుకోవడానికి రెడీ అయ్యే సినిమాలు మానేస్తున్నాను అని ఆయన మాటల సారాంశం. ఇది పవన్ ఫ్యాన్స్ కు మాత్రం మింగుడు పడని వార్తే..