English | Telugu

పవన్ ప్రెస్ మీట్ హైలెట్స్

- పాస్ లు లేని ఫ్యాన్స్ దయచేసి ఫంక్షన్ కు రావద్దు. ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాస్ లు లేకుండా వచ్చి ఇబ్బంది పడద్దు.

- చిరంజీవి వస్తారు. గబ్బర్ సింగ్ కు చేసినట్టే ఆడియో రిలీజ్ చేస్తారు.

- వర్మ ట్వీట్లు ఆయన అభిప్రాయానికి సంబంధించినవి. నేను ఆయన్ని గౌరవిస్తాను.

- హిందీలో డబ్బింగ్ చెప్పట్లేదు. పాట కూడా పాడట్లేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ చెబుతారు.

- రికార్డులు బద్ధలు గొట్టాలని నేను ఎప్పుడూ ఆలోచించను. సినిమా బాగుంటే ఆడుతుంది అంతే. ఫలితం ఎప్పుడూ భగవంతుడిదే.

- నేను డైరెక్షన్ చేస్తే లిమిటేషన్స్ వచ్చేస్తాయి. అందర్నీ పుష్ చేయాలి. అందుకే వద్దనుకున్నాను

- సినిమాలు మానేయడం కన్ఫామ్. పాపులారిటీ లేనంత మాత్రాన ప్రాణం పోదు కదా..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.