English | Telugu

టాలీవుడ్ పవర్ బర్త్ డే

తెలుగు వెండితెర పవర్‌ ఎంతో చూపించిన స్టార్‌ హీరో మెగా షాడోలో వెండితెరకు పరిచయం అయినా తనకంటూ ప్ర్తత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియల్‌ స్టార్‌, తెర మీదే కాదు తెరవెనుక కూడా హీరోయిక్‌ క్యారెక్టర్‌ ఉన్న రియల్‌ మేన్‌, తన తిక్కతో తెలుగు సినిమా రికార్డ్‌ల లెక్స్‌ సరి చేసిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. ఈ రోజు పవన్‌ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్‌ పై ఓ లుక్‌..

మెగాస్టార్‌ చిరంజీవి వారసునిగా వెండితెరకు పరిచయం అయిన కొణిదల కళ్యాణ్‌బాబు తరువాత తనదైన నటనతో స్టార్‌ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్‌లో మరె స్టార్‌కు సాధ్యం కాని భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సాదించి పవర్‌స్టార్‌ అనిపించుకున్నాడు.

1996లో రిలీజ్‌ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన పవన్‌ ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడిగా మారాడు. కాని ఖుషి సక్సెస్‌ పవన్‌ కళ్యాణ్‌కు ఎంతటి బ్రేక్‌ ఇచ్చిందో అదే రేంజ్‌లో బ్రేక్‌ కూడా వేసింది.

ఖుషి పవన్‌ చేసిన సినిమాలన్ని వరుసగా పరాజయాలుగా నిలిచాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఏళ్ల పాటు పవన్‌ కెరీర్‌లో ఒక్క భారీ సక్సెస్‌ కూడా లేదు.. అయినా పవర్‌స్టార్‌ పవర్‌ మాత్రం తగ్గలేదు. అయన క్రేజ్‌ కూడా తగ్గలేదు. ప్రతి సినిమాకు అదే ఓపెనింగ్స్‌ అవే ఎక్స్‌పెక్టేషన్స్‌ అదే పవన్‌ స్టామినా మవన్‌ మేనియా.

అలా పన్నెండేళ్ల పాటు ఎదురుచూసిన అభిమానుల కల నేరవేర్చిన సినిమా గబ్బర్‌ సింగ్‌. నాక్కొంచెం తిక్కుంది కాని దానికో లెక్కుంది అంటూ పవన్‌ వెండితెర మీద సృష్టించిన సునామీ బాక్సాఫీస్‌ రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది.

పవన్‌ కేవలం నటుడే కాదు ఆయనో దర్శకుడు, రచయిత, కొరియోగ్రాఫర్‌, ఫైట్‌ మాస్టర్‌, గాయకుడు కూడా ఇలా సినిమాకు సంభందించిన అనేక విభాగాల్లో తానేంటో నిరూపించుకున్నాడు పవన్‌. వీటిన్నింటికి మించి పవన్‌ అంటే సింప్లిసిటీని నిలువెత్తు రూపం, నిజాయితీకి అసలు సిసలు నిర్వచనం అన్నింటికి మించి అభిమానులకు దేవుడు.

ప్రస్థుతం అత్తారింటికి దారేది అంటూ వెండితెర మీద మరో చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతున్న పవన్‌ కళ్యాణ్‌కు తెలుగువన్‌ తరుపున మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.