English | Telugu

ప్రకాష్ రాజ్ సమస్య పరిష్కరిస్తాం

నటుడు ప్రకాష్ రాజ్ పై "ఆగడు" చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ తెలుగు సినీదర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ వివాదంపై మీడియా ద్వారా ప్రకాష్ తన వాదనను వినిపించాడు. అంతే కాకుండా ఈ వివాదం వెనుక ఉన్న ఆ ఒక్కడిని బయటపెట్టబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయంపై ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ఎన్.వి. ప్రసాద్ స్పందిస్తూ... ప్రకాష్ రాజ్ మీడియా సమావేశాన్ని టీవీ ఛానళ్ళ ద్వారా చూసాను. ఇలాంటి వివాదాల వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడటం మా బాధ్యత" అని అన్నారు.