English | Telugu
ఎన్టీఆర్ బాధపడితే..నవ్వుతున్నారు!
Updated : Aug 7, 2014
ఎన్టీఆర్ అభిమానులు ఆశగా చూస్తున్న 'రభస' సినిమా వెనక్కి వెళ్ళడంతో ఆయన బాధపడుతున్నాడట. మొదటి నుంచి ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలచేస్తామని చెప్పిన ప్రొడ్యూసర్ సడన్ ప్లాన్ మార్చేసరికి ఎన్టీఆర్ ఆగ్రహంగా వున్నాడట. బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ లాంచింగ్ చిత్రం అల్లుడు శీనుని అర్దాంతరంగా థియోటర్స్ నుంచి లేపేయటానికి మనసొప్పక వాయిదా అడిగాడని సమాచారం. అయితే రభస’ రిలీజ్ వాయిదా పడడంతో చిన్న సినిమాల నిర్మాతలు ఆనందంగా వున్నారు. రభస రిలీజ్ అయితే తమ చిత్రాల్ని ఎక్కడ ఎత్తేస్తారో అని భయపడ్డ నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ వారంలో గాలిపటం, గీతాంజలి చిత్రాలు వస్తుండగా ఆగస్ట్ 15న సూర్య 'సికందర్'.. మారుతి నిర్మించిన లవర్స్తో పాటు మంచు విష్ణు నటించిన అనుక్షణం రిలీజ్ అవుతోంది. 'రభస' వాయిదా వల్ల ఇంతమందికి ఛాన్స్ దొరికింది.