English | Telugu

సమంత అందాల ఆరబోత ఎక్కువైంది..!

టాలీవుడ్ లక్కీ గర్ల్ సమంత వున్నట్టుండి గ్లామర్‌ డోస్‌ ఓ రేంజ్ లో పెంచేసింది. గతంలో ఓ మోస్తరు గ్లామర్‌తో కన్పించిన సమంత సడన్ అందాల ఆరబోత మొదలు పెట్టడానికి కారణం ఏమిటి? సౌత్ లో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న సమంతకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే తన కంటే వెనుక వచ్చిన భామలు శ్రుతిహాసన్, తమన్నాలు అందాల ఆరబోతతో వరుస ఆఫర్ లు దక్కించుకుంటూ యూత్ లో సడన్ గా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. శ్రుతిహాసన్ తన లాస్ట్ సినిమాల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. దీంతో సమంతకు తనని తాను తరచి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ‘అల్లుడు శీను’ సినిమాలో అందాల ప్రదర్శనలో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇక, సమంత తాజా చిత్రం ‘రభస’...‘సికిందర్‌’ సినిమాలోనూ ఆమె గ్లామర్‌ ఓ రేంజ్‌లో ఒలకబోసేసిందని ఆ సినిమా స్టిల్స్‌ని చూస్తే అర్థమవుతుంది. అయితే ఏది ఏమైనా మాత్రం సమంతా గ్లామర్‌ డోస్‌ కుర్రకారుకి కిక్కేస్తుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.