English | Telugu
ఆడియన్స్ నూ ప్రేమలో పడేస్తా: సచిన్ జోషి
Updated : Aug 7, 2014
‘మౌనమేలనోయి’, ‘నినుచూడక నేనుండలేను’, ఒరేయ్’ పండు సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా తన ప్రత్యేకతను చాటుకున్న హీరో సచిన్ జోషి. ఆయన పుట్టిన రోజు నేడు. టాలీవుడ్ చాలా రోజులు తరువాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న సచిన్ ఈ సారి ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నారు. అందుకోసం బాలీవుడ్ లో సక్సెస్ అయిన మ్యూజికల్ లవ్ స్టొరీ 'ఆషికి-2 ' తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ అనే టైటిల్ తో రీమెక్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఆడియో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మధ్య తెలుగులో యాభై వేలకు పైగా ఆడియో సీడీలు అమ్ముడై పోయిన సినిమా ఇదేనట.
ఈ సినిమా గురించి హీరో మాట్లాడుతూ.. '''ఆషికి-2 'తెలుగు నెటివిటీకి తగిన విధంగా సినిమా ప్రెజంట్ చేయడంలో, మేకింగ్, మ్యూజిక్ పరంగా లవ్ ఫీల్ ను ప్రేక్షకులకు అందించడానికి తగిన మార్పులు చేశాం. తెలుగులో వస్తోన్న లవ్ స్టోరీలో ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుంది. బి, సి సెంటర్స్ లోని ఆడియెన్స్ కి కూడా సినిమా బాగా రీచ్ అవుతుంది. చంద్రబోస్ గారి సాహిత్యం సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగా ఉంటుంది. అది సినిమాలోనే చూసి తెలుసుకోవాలి.'' అని సచిన్ జోషి అన్నారు.