English | Telugu
టెంపర్ మళ్లీ లీకయ్యిందోచ్
Updated : Dec 8, 2014
ఫక్ట్ లుక్ కంటే ముందే ఎన్టీఆర్ స్టిల్స్ బయటకు వచ్చేశాయ్. ఇప్పుడు టీజర్ రాకుండానే కథ లీకైపోయింది. ఇంతకీ టెంపర్ కథేంటంటే... ఎన్టీఆర్ ఓ అనాథ. చిన్నప్పుడు తిండీ తిప్పలు లేక అల్లాడిపోతాడు. ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్ ని చూసి ''నేనూ పోలీస్ అయితే అలానే డబ్బులు సంపాదించొచ్చు కదా..'' అని డిసైడ్ అవుతాడు. అప్పటి నుంచీ ఒక్కటే లక్ష్యం.. పోలీస్ కావడం. చివరకు పోలీస్ అవుతాడు. దొరికిందంతా దోచుకొంటాడు. వైజాగ్ దాదా అయిన ప్రకాష్‌రాజ్‌తో బేరం పెట్టుకొంటాడు. దొంగ పోలీస్ లా కార్లు, బంగళాలూ సంపాదిస్తాడు. చివరికి ''నేను చేస్తోంది తప్పు..'' అనే సంగతి తెలుస్తుంది. ఆ తరవాత మార్పు వస్తుంది. ఎవరి అరాచకాలకు అండగా నిలిచాడో, వాళ్లనే తుక్కు రేగ్గొట్టడం స్టార్ట్ చేస్తాడు.. తన టెంపర్ చూపిస్తాడు. అదీ టెంపర్ కథ. ఇదంతా వింటుంటే లక్ష్మీనరసింహా గుర్తొస్తుంది కదూ. మరి పూరికి మాత్రం ఈ బల్బ్ వెలగలేదేమో..? కథ పాతదైనా పూరి జగన్నాథ్‌కి కథనంతో మ్యాజిక్ చేసే దమ్ముంది. ఆయన కూడా దాన్నే నమ్ముకొన్నాడేమో. మరి తెరపై 'లక్ష్మీనరసింహా 2' ఎంత హంగామా చేస్తుందో ఏంటో..??