English | Telugu

పెద్దాయ‌న డైరెక్ష‌న్ చేస్తాడా?

నిర్మాణ రంగంలో దశాబ్దాల అనుభ‌వం సొంతం చేసుకొన్నారు కె.ఎస్‌.రామారావు. అభిలాష‌, మాతృదేవోభ‌వ‌, చంటి... ఇలా సినిమా పేర్లు చెబితే చాలు, ఆయ‌న అభిరుచి ఏమిటో అర్థ‌మైపోతుంది. తాజాగా మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అన్న‌ట్టు ఈ పెద్దాయ‌న‌కు డైరెక్ష‌న్‌మీద బాగా మ‌క్కువ ఉన్న‌ట్టుంది. ల‌వ్ గురు అనే కాన్సెప్టుతో నిత్య‌మీన‌న్‌కి ఓ క‌థ వినిపించార‌ట అప్ప‌ట్లో. అయితే ఆ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చలేదు. కాక‌పోతే ఎప్ప‌టికైనా మెగా ఫోన్‌ప‌ట్టుకొని కెప్టెన్ కుర్చీలో కూర్చోవాల‌న్న ఆశ మాత్రం ఉంది. త్వ‌ర‌లోనే ఆయ‌న నుంచి ద‌ర్శ‌క‌త్వం క‌బురు వ‌స్తే, ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ద‌ర్శ‌కులు నిర్మాత‌లుగా మార‌డం, నిర్మాత‌లు అప్పుడ‌ప్పుడూ కెప్టెన్ కుర్చీలో కూర్చోవ‌డం మామూలే. అయితే ద‌శాబ్దాల అనుభ‌వం త‌ర‌వాత.. కెప్టెన్ అవ్వ‌డం కొత్త‌గా అనిపిస్తోంది. మ‌రి కె.ఎస్‌.రామారావు డైరెక్ట‌ర్ గా డెబ్యూ ఎప్పుడు చేస్తారో చూడాల్సిందే.