English | Telugu
ఔను.. మహేష్ కి 'నో' చెప్పా!
Updated : Dec 9, 2014
మహేష్.. మహేష్... అంటూ కథానాయికలు మొత్తం ఆయన జపం చేస్తుంటారు. మహేష్ సినిమాలో కథానాయికగా అవకాశం ఇస్తానంటే... చేతిలో ఉన్న సినిమాల్నీ వదిలేసుకోవడానికి కూడా సిద్ధమే. అలాంటిది మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం ఇస్తానన్నా నో చెప్పింది. ఆ కథానాయిక ఎవరో కాదు. సోనాక్షిసిన్హా. బాలీవుడ్‌లో నెంబర్ వన్ పొజీషన్‌కోసం పోరాడుతున్న కథానాయిక సోనాక్షి. గతేడాది మహేష్ పక్కన కథానాయికగా నటిస్తావా?? అని అడిగితే ''నో'' చెప్పేసింది. ఈ విషయాన్ని సోనాక్షి సిన్హా ధృవీకరించింది కూడా. ''నాకు సౌత్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా నటించమన్నారు. మహేష్ బాబు సినిమాలో కథానాయికగా ఛాన్స్ ఇస్తానన్నారు. కానీ... అప్పట్లో నాకు కాల్షీట్లు అందుబాటులో లేవు. అందుకే ఆ సినిమా వదులుకొన్నా. భవిష్యత్తులో ఇలాంటి ఛాన్స్ వస్తే వదులుకోను'' అంటోంది సోనాక్షి. ప్రస్తుతం రజనీకాంత్ లింగాలో జోడీ కట్టింది ఈ ముద్దుగుమ్మ. ఫ్యూచర్‌లో తెలుగు కథానాయకల పక్కన మెరిసే ఛాన్సుందన్నమాట.